
ఇక టి20 ఫార్మాట్లో జరిగే ఆసక్తికర ఘటనలు అయితే అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అందుకే రెప్పపాటు కాలంలో జరిగే ఈ ఘటనలు ఇక మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులను రెప్పవాల్చకుండా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇటీవలే అండర్19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవల భారత అండర్ 19 ఉమెన్స్ టీం ఇంగ్లాండు టీం మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో భాగంగా ఏకంగా ఇంగ్లాండును 69 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు అతి తక్కువ టార్గెట్తో బరిలోకి దిగి చివరికి విజయాన్ని సాధించింది.
విశ్వ విజేతగా నిలిచి సరికొత్త చరిత్రకు నాంది పలికింది భారత అండర్ 19 ఉమెన్స్ టీం. అయితే ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో అటు ఒక స్టన్నింగ్ క్యాచ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. భారత క్రికెటర్ అర్చన దేవి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో 12 ఓవర్ వేసింది పార్సవి చోప్రా. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ బాటర్ రియానా మీడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడింది. ఈ క్రమంలోనే మిడ్ ఆఫ్ లో ఫీలింగ్ చేస్తున్న అర్చన కుడి వైపుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకుంది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది.