ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికి ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ లో మునిగి తేలుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీ లో బలిలోకి దిగుతూ ఉండగా.. ఆస్ట్రేలియా ప్యాట్ కమ్మిన్స్  సారథ్యంలో టీమిండియాతో తలబడెందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. అయితే ఇరు జట్లకు కూడా ఈ టెస్ట్ సిరీస్ ఎంతో అని చెప్పాలి. ముఖ్యంగా భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధించాలంటే.. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం.



 ఈ క్రమంలోనే భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ఇక భారత జట్టు ఎక్కువగా స్పిన్నర్లపై ఆధారపడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో కంగారులను కంగారు పెట్టకపోతే ముగ్గురు ఆటగాళ్లు రిటైర్మెంట్ జోన్లోకి వెళ్లిపోవడం ఖాయం అనేది ప్రస్తుతం విశ్లేషకులు అంచనా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 జయదేవ్   : దాదాపు 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న జయదేవ్ ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్లో ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఉంటాడా లేదన్నది అనుమానంగా మారింది. బుమ్రా అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో అతని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అదే సమయంలో  ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగే టెస్టు సిరీస్లో ఛాన్స్ వచ్చిన రాకున్నా ఈ సిరీస్ ముగిసిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందట.

 రవిచంద్రన్ అశ్విన్  : టెస్ట్ క్రికెట్లో ప్రమాదకరమైన స్పిన్నర్ లలో ఒకడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అశ్విన్. అయితే అతనికి 36 ఏళ్లు. అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు రవీంద్ర జడేజా, అక్షర పటేళ్లు జట్టులో ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా తో సిరీస్ లో అశ్విన్ కంగారులను కంగారు పెట్టకపోతే మాత్రం ఇక రిటైర్మెంట్ జోన్ లోకి వెళ్తాడు అన్నది అంచనా.

 ఉమేష్ యాదవ్ :  భారత్ ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత అటు ఉమేష్ యాదవ్ కూడా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జట్టుకు మహమ్మద్ షమీ, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాగూర్ లాంటి ఫేసర్లు అందుబాటులో ఉన్నారు. ఈ ఫేసర్లను దాటుకొని తుదిజట్టులోకి వస్తే ఇక ఉమేష్ మెరుపులు మెరూపించలేదంటే చాలు చివరికి పూర్తిగా జట్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఈ సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ క్రికెట్కు అతను రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: