ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాలో కీలక స్పిన్నర్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే జట్టులోకి ఎంతో మంది యువ స్పిన్నర్లు వస్తున్నప్పటికీ అటు రవిచంద్రన్ అశ్విన్ మాత్రం తన స్పిన్ లో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రతి మ్యాచ్ లో కూడా తనని తాను కొత్తగా నిరూపించుకుంటూ ఉంటాడు. అందుకే అతన్ని టీమిండియాలో తెలివైన బౌలర్ అని పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ప్రత్యర్థిని తన బంతులతో  బోల్తా కొట్టించడంలో రవిచంద్రన్ అశ్విన్ దిట్ట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అందుకే 36 ఏళ్ల వయస్సు దాటిపోతున్న ఇంకా యువ ఆటగాళ్లను కాదని టీమిండియా సెలెక్టరు రవిచంద్రన్ అశ్విన్ కు భారత తుది జట్టులో అవకాశం కల్పిస్తున్నారు. ఇక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అతను అదరగొడుతున్నాడు అని చెప్పాలి. అయితే మిగతా ప్లేయర్లతో పోల్చి  చూస్తే అశ్విన్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు. ఈ క్రమంలోనే తన పోస్టులతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక మహిళ పోస్ట్ కి అశ్విన్ ఇచ్చిన రిప్లై కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 సోషల్ మీడియా వేదికగా మహిమ అనే అమ్మాయి చేసిన పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు అశ్విన్. అబ్బాయిలకు ఒక్కటి మాత్రమే అవసరం.. అది కూడా 'బి' తో స్టార్ట్ అవుతుంది అని ఒక ప్రశ్న అడిగింది మహిమ అనే నెటిజన్.  అయితే దీనికి చాలా మంది చాలా విధాలుగా రిప్లై ఇచ్చారు అని చెప్పాలి. ఇక ఇదే పోస్టు అటు టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కంట పడింది.  దీంతో తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. బి అంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ రిప్లై ఇచ్చాడు.  దీంతో ఇక అశ్విన్ రిప్లై పై స్పందిస్తున్న నెటిజన్స్ మీ రిప్లై సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: