ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్ ఇండియా మంచి ప్రదర్శన చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా అటు ఆస్ట్రేలియా పై పూర్తి ఆధిపత్యం సాధించి.. ఇక రెండు మ్యాచ్ లలో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే టీమిండియా విజయం అయితే సాధించింది. కానీ ఇక టీమ్ ఇండియాలో ఉన్న లోపాలు మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కేవలం స్పిన్ విభాగం పైనే పూర్తి భారం వేస్తూ ఇక బ్యాట్స్మెన్లు పూర్తిగా చేతులెత్తేస్తూ ఉన్నారు అని చెప్పాలి. జట్టులో బ్యాట్స్మెన్లలో ఒక్కరో ఇద్దరో పర్వాలేదు అనిపిస్తున్న మిగతా అందరూ కూడా చేతులెత్తేస్తూ ఉన్నారు.


 ఇప్పటివరకు టీమ్ ఇండియా రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించింది అంటే అది కేవలం స్పిన్ బౌలర్ల పుణ్యమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ లవ్ అయితే పూర్తిగా చేతులెత్తేసింది టీమిండియా. కేవలం 18 పరుగుల వ్యవధిలోనే ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది అని చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అదరగొడతాడు అనుకున్న గిల్ సైతం నిరాశ పరిచాడు. రోహిత్, గిల్,  పూజార, రవీంద్ర జడేజా,  శ్రేయస్ అయ్యర్  ఇలా టాప్ ఆర్డర్ మొత్తం ఆస్ట్రేలియా బౌలింగ్ దెబ్బకి కుప్పకూలిపోయింది.


 అయితే ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచిన ఆనందంలో ఇక ఆలోచన చేయకుండానే భారత జట్టు బరిలోకి దిగింది అన్నది తెలుస్తుంది. అయితే అప్పుడు వరకు స్పిన్ మైదానాలలో ఇబ్బంది పడిన ఆస్ట్రేలియా బౌలర్లు ఇక పచ్చిక మైదానంపై పదునైన బంతులను సందించారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు అటు ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న టీమిండియా బ్యాట్స్మెన్లు.. ఆ తర్వాత మాత్రం చివరికి వికెట్ సమర్పించుకోక తప్పలేదు. ఇక మొదటి రెండు టెస్టుల్లో ఓడిపోయాం అన్న కసి ఆస్ట్రేలియాలో కనిపించింది అని చెప్పాలి. ఇలా 45 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా
 దీంతోఅభిమానులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి గల్లీ క్రికెట్ ఆడుతున్నారా అంటూ విమర్శలు పంపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: