బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ ఆతిథ్య భారత జట్టుతో నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా హోరాహోరీగా తలబడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ లో భాగంగా 2-1 తేడాతో భారత జట్టు ఇక మరోసారి సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే భారత జట్టు మొదటి రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక చివరి నాలుగో టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రాగానే ముగిసింది అని చెప్పాలి.


 ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ పై మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టింది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరాలంటే టీమిండియా నాలుగో మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన సమయంలో ఇక శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో.. ఇక నాలుగో మ్యాచ్ ఫలితం అవసరం లేకుండానే అటు డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టింది టీంఇండియా అని చెప్పాలి. అయితే ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత అటు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఏ జట్టు ఏ స్థానంలో కొనసాగుతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది అని చెప్పాలి. ఇక ఈ ర్యాంకింగ్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా టాప్ లోనే కొనసాగుతూ ఉంది. 122 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక కొన్ని పాయింట్లు మెరుగుపరుచుకున్న టీమిండియా జట్టు 119 పాయింట్లు రెండవ స్థానంలో ఉంది. ఒకవేళ బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాను 3-1 తేడాతో ఓడించి ఉంటే ప్రపంచ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకునేది అని చెప్పాలి. ఇక పాయింట్లు పట్టికలో తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc