వన్డే మ్యాచ్లో తెలుగు క్రికెటర్ సెంచరీతో చెలరేగిపోయాడు. అప్పటికే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఒంటి చేత్తో విజయం వైపు నడిపించాడు. ఇక అతని ప్రతిభ చూసి ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతున్నారు. ఆగండి ఆగండి.. తెలుగు క్రికెటర్ ఏంటి.. సెంచరీ చేయడం ఏంటి.. అసలు టీమిండియా ఆడుతున్న వన్డే సిరీస్ లో ఇలాఏ తెలుగు క్రికెటర్ సెంచరీ చేశాడు.. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అయితే మనం మాట్లాడుకునేది ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న తెలుగు క్రికెటర్ గురించి కాదు.. నెదర్లాండ్స్ కు ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు గురించి.



 ఇటీవల జింబాబ్వే తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు అజేయమైన సెంచరీ తో చలరేగిపోయాడు. అంతేకాదు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే తేజ మెరుపు సెంచరీ కారణంగా తొలి వన్డేలో నెదర్లాండ్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన తేజ నిడుమనూరు 96 బంతుల్లో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.



 ఇక మరోవైపు నుంచి అతనికి శారీజ్ అహ్మద్ 30 పరుగులతో సహకారం అందించాడు అని చెప్పాలి. దీంతో ఇక అతని ప్రతిభను  అందరూ మెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఈ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించాడు. వన్డే ఫార్మాట్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి సెంచరీ సాధించిన 5వ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు తేజ నిడమనూరు . అంతేకాకుండా వన్డేల్లో చేజింగ్ సమయంలో ఏడో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా కూడా తేజ, శారీజ్ అహ్మద్  జోడి నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: