భారత క్రికెట్లో సీనియర్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అజింక్య రహానే. గత కొంతకాలం నుంచి భారత జట్టుకు పూర్తిగా దూరమైపోయాడు అని విషయం తెలిసిందే. అంతేకాదు ఇక భారత క్రికెట్లో అతను ఒక టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మాత్రమే అనే ఒక ముద్ర వేసుకున్నాడు. టీ20 లకు వన్డే ఫార్మాట్ కు అతను అస్సలు పనికిరాడు అంటూ ఎంతో మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. దీంతో భారత జట్టులో అతను ఛాన్స్ దక్కించుకున్న.. అది కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇక వైస్ కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.


 అలాంటి అజింక్య రహనే సీనియర్ అనే కారణంతో చివరికి అతన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. ఎప్పుడు టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడిన కూడా జట్టు ఎంపికలో అజింక్య రహనే ను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదు. అలాంటి రహనే కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో.. ఐపీఎల్ లో మెరుపు ప్రదర్శనలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే ముద్రపడిన రహనేను.. టి20 ఫార్మాట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారిని మించిన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు.



 చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న సెలెక్టర్లు ఇక ఆస్ట్రేలియా తో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో రహానేకు చాన్స్ ఇచ్చారు. ఇక దీనిపై రహానే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఢిల్లీ, కోల్కతా జట్లలో ఉన్న సమయంలో పెద్దగా అవకాశాలు రాలేదు. సిఎస్కే జట్టుకు ఆడేటప్పుడు స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ వచ్చింది. అందుకే తానేంటో నిరూపించుకున్నాను. అవకాశాలు రాకపోతే ఎలా నిరూపించుకోగలం అంటూ అజింక్య రహనే వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl