కోటి విద్యలు ఉన్న కూటి కొరకే అన్నట్టు,ప్రతి ఒక్కరూ వారు చేసే పని బాగా అభివృద్ధి చెందాలని,దానితో సంపదలు కలిసి రావాలని భావిస్తూ ఉంటారు.కానీ కొంతమంది ఎంత శ్రమించినా ఆ ఫలితం దక్కలేదని బాధపడుతూ ఉంటారు కూడా.ఇలా ఎంత బాధపడినా సరే మన సంపద పెరగకపోగా,కుటుంబంలో చికాకులు సమస్యలు అధికమవుతాయి.వీటన్నిటికి ఉపశమనం లభించి,మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఈ అధిక శ్రావణంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు పనులు చేయడంతో లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుందని వేద నిపుణులు చెబుతున్నారు.మరి అలాంటి పనులు ఏంటో మనము తెలుసుకుందామా..

ఈ అధిక శ్రావణంలో ప్రతి శుక్రవారం పూట,ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని,లక్ష్మి దేవికి లక్ష్మి గవ్వలతో కుర్చిన హారం వేసి,ఆ తల్లికి ఇష్టమైన  ఎర్రటి పూలను సమర్పించి,పూజలు నిర్వహించాలి.ఆ తరువాత ఒక రాగి కలశం చెంబు తీసుకొని,దానికి పసుపు, కుంకుమలతో బొట్లను పెట్టి,దానినిండా నీళ్లు పోయాలి. ఈ చెంబుచుట్టు పసుపు దారంతో కట్టిన ఎర్రటి పూలను చుట్టాలి.తరువాత ఆ చెంబులోకి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయాలి.అందులోనే 11 రూపాయలను,చిటికెడు ఆవాలను వేయాలి.ఇప్పుడు ఈశాన్యం మూలలో పసుపుతో అలికి,కుంకుమ బొట్లు పెట్టి,దానిపై ఉప్పును నెరవాలి.తరువాత మనం తయారు చేసుకున్న కలిశం ఉంచి మనం లక్ష్మీదేవినిమనసారా పూజించుకోవాలి.

ఇలా అధిక శ్రావణంలో వచ్చే శుక్రవారం పూట చేయడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. అంతేకాకుండా ఇక్కడ వాడిన ఉప్పుతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోగోడుతుంది.దీనితో ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది కూడా.

ఈ నివారణతో పాటు ప్రతి ఒక్కరూ సంధ్యా సమయంలో లేవడం అలవాటు చేసుకోవడంతో,ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది.మరియు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడు కళకళలాడుతూ నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి.అంతేకాక చిరిగిన గుడ్డలు కట్టుకోవడం, గాజులు వేసుకోకుండా ఉండడం,బొట్టు పెట్టుకోకుండా ఉండడం,ఎప్పుడు చిరుబురులాడుతూ పిల్లలను,భర్తను తిడుతూ ఉండడం వంటివి అసలు చేయకూడదు.ఇలా చేసే వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎప్పుడు నిలువ ఉండదు.కావున ప్రతి ఒక్కరూ ఈ నివారణ మరియు నియమాలను కచ్చితంగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: