రియో లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఇప్పటికే ఒక బంగారు ఒక రజతం ఒక కాంస్య పతకాలతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్లు ఇప్పుడు మరో స్వర్ణ పతకాన్ని కూడా కైవసం చేసుకున్నారు. జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝారియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జావెలిన్ ను 63.97 మీటర్లు విసిరి దేవేంద్ర సరికొత్త రికార్డును సృష్టించాడు.

 

ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం వచ్చాయి. 2004 ఎథేన్స్ పారాలింపిక్స్ లో దేవేంద్ర ఝఝారియా స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇక ఈ స్వర్ణ పతకంతో పారాలింపిక్స్ లో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: