ఎన్నో ఏళ్ల  పాటు క్రికెట్ లో కొనసాగి భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. తనదైన అద్భుత ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్ లను  విజయతీరాలకు చేర్చాడు. సచిన్ టెండుల్కర్ బ్యాట్ పట్టి  మైదానంలోకి దిగాడు అంటే బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. ఇక క్రికెట్లో ఎన్నో సంచలన రికార్డులను సైతం నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. ఇండియన్ క్రికెట్ దేవుడిగా కూడా సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గా  అని కూడా అంటారు. కాగా  సచిన్ కు  టీమిండియా వరల్డ్ కప్ సాధించి ఘన వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

 


 అయితే  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి బాటలోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సి.కె.నాయుడు ట్రోఫీలో పాల్గొనే ముంబై జట్టులో అర్జున్ ఆల్ రౌండర్ కోటాలో స్థానం దక్కించుకున్నారు. రెండేళ్ల క్రితం ముంబై అండర్ 19 జట్టులో ఎంట్రీ ఇచ్చిన అర్జున్  తొలినాళ్లలో పెద్దగా రాణించలేదు. ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ అయిన అర్జున్  ఇంగ్లాండ్లో కూడా శిక్షణ పొందాడు. టీమ్ ఇండియా జూనియర్ టీమ్ లో తరఫున విదేశాల్లో ఆడిన అర్జున్ టెండూల్కర్ కి అంతగా గుర్తింపు దక్కలేదు. 

 

 ముఖ్యంగా అర్జున్ టెండూల్కర్ కు నిలకడ లేమి  ప్రధాన సమస్య. అడపదడప మెరుపులు తప్ప సంచలనాత్మక రీతిలో ఒక స్పెల్ వేయలేక పోయాడు అర్జున్ టెండూల్కర్... అంతేకాకుండా ఒక భారీ ఓపెనింగ్స్ కూడా లేకపోవడంతో అతని కెరియర్  పురోగతి ఎంతో క్లిష్టంగా మారింది. కాగా సి.కె.నాయుడు టోపీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో యువ సంచలనం యశస్వి  జైస్వాల్  కూడా చోటు లభించింది. యశస్వి  జైస్వాల్  ఇటీవలే ముగిసిన అండర్ 19 వరల్డ్ కప్ లో ఒక సెంచరీ నాలుగు అర్ధ సెంచరీలు సాధించి అద్భుత ప్రదర్శనతో అందరి ప్రశంసలు దక్కించుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: