

విషయం ఏమిటంటే సారా టెండూల్కర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫోటోని పోస్ట్ చేసి దాని కింద క్యాప్షన్ గా 'I SPY' అని పెట్టి ఎవరినో తాను రహస్యంగా గమనిస్తున్నట్లు ఒక ఈమోజి ని పెట్టింది. అయితే అందులో వింతేమీ ఉంది…. అసలు అక్కడ తన బాయ్ ఫ్రెండ్ గా చెప్పబడే భారత క్రికెటర్ గురించి ఏమి లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్టు.

భారత యువ టాలెంటెడ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ గురించి క్రికెట్ అభిమానులకి అందరికీ తెలిసిందే. అతని బ్యాటింగ్ స్టైల్ మరియు సమర్ధతను ఇప్పుడే కోహ్లీ, సచిన్ లతో అభిమానులు పోలుస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ జాతీయ టీమ్ లోకి కూడా ఈ మధ్యనే ప్రవేశించాడు. అయితే గిల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో వేసి అచ్చం సచిన్ కూతురు అని ఈ 'I SPY' అని క్యాప్షన్ పెట్టి అచ్చు సారా లాగే కనుగుడ్లు పక్కకు పెట్టడం గమనార్హం.
దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని.... ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అదీ కాకుండా ఎప్పటినుండో శుభ్ మన్ గిల్ ను అందరూ 'జూనియర్ టెండూల్కర్ ' అనిఅనడం గమనార్హం. మరి ఈ విషయంపై సచిన్ స్పందిస్తాడా.. సారా స్పందిస్తుందా లేకపోతే మన ప్రేమికుడిగా చెప్పబడుతున్న గిల్ బాబు స్పందిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.