అయితే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 235పరుగులు చేసింది.. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సన్రైజర్స్ జట్టు 193 పరుగులు చేసింది. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరు ఎంతో ఉత్కంఠభరితంగా మారిపోయింది అనే చెప్పాలి. ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనేక రికార్డులు నమోదు కావడం గమనార్హం.
సాధారణంగా ఏదైనా మ్యాచ్ జరిగినప్పుడు ఒకటి లేదా రెండు రికార్డును నమోదు కావడం చూస్తూ ఉంటాం. కానీ నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒకటి కాదు రెండు కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే రికార్డులు నమోదు కావడం గమనార్హం. నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో ఈ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. ఇక అదే సమయంలో ఒకే మ్యాచ్ లో ఐదు క్యాచ్లు పట్టిన ప్లేయర్ గా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు నబి రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ చేసిన స్కోర్ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 10వ ఓవర్ లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది ఇది కూడా అత్యధికమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి