ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అందరి అంచనాలు తారుమారయ్యాయి. స్టార్ క్రికెటర్ లుగా కొనసాగుతున్న వారు ఒకప్పుడు పరుగుల వరద పారించిన వారు.. ఈసారి మాత్రం నిరాశ పరిచారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి అనుభవం లేని యువ ఆటగాళ్లు ఇక మొదటి సారి ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న వారు మాత్రం అదర గొట్టారు అని చెప్పాలి. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన కనపరిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుర్రాళ్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


 తిలక్ వర్మ  : ముంబై ఇండియన్స్ జట్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ మొదటి నుంచి అదరగొడుతున్నాడు. 11 భాషలలో రెండు అర్థ శతకాలు సాధించి 334 పరుగులు చేశాడు. సీనియర్లు చేతులెత్తేసిన సమయంలో ఒంటరి పోరాటం సాగించి ప్రశంసలు అందుకున్నాడు.

 అభిషేక్ శర్మ : హైదరాబాద్  ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ ఏడాది అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల ఎడమచేతివాటం ఆల్రౌండర్ 331 పరుగులు సాధించాడు. ఇక అత్యధిక స్కోరు 75 కావడం గమనార్హం.

 సాయి సుదర్శన్ : అరంగేట్రం మ్యాచ్  లోనే అందరినీ తన ప్రదర్శనతో ఆశ్చర్యపరిచాడు సాయి సుదర్శన్ ఎక్కడ భయం బెరుకు లేకుండా చక్కటి షాట్ల ద్వారా పరుగులు రాబట్టారు పంజాబ్తో జరిగిన మరో మ్యాచ్లో 65 పరుగులతో రాణించాడు. 5 ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేశాడు.


ఆయుష్ భదోని : ప్రస్తుతం లక్నో జట్టు లో ఆడుతున్న ఆయుష్ బాదోని అరంగేట్రం మ్యాచ్ లోనే 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక అన్ని మ్యాచ్ లలో రాణించాడు..

 ఇక వీరితో పాటు గుజరాత్ లో ఉన్న అభినవ్ సన్రైజర్స్ జట్టులో స్పీడ్ గన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కొనసాగుతున్న 25ఏళ్ల ముఖేష్ చౌదరి ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: