టీమిండియా సారధిగా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఇక అటు విజయాలతో ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే అత్యంత విజయవంతమైన సారధిగా గుర్తింపు సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కి ఐదు సార్లు టైటిల్ అందించాడు.. ఇక ఇప్పుడు టీమిండియా సారధిగా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా తన వ్యూహాలతో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా గత కొంతకాలం నుంచి వరుసగా ప్రత్యర్ధులను ఓడిస్తూ పూర్తి ఆదిపత్యాన్ని కనబరిస్తుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ లో కూడా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని రోహిత్ శర్మ మరోసారి అద్భుతం చేసి చూపించాడు. సౌత్ ఆఫ్రికా పై స్వదేశంలో టీ20 సిరీస్ గెలవడం టీమిండియా కు ఇదే తొలిసారి అని చెప్పాలి.


 అంతేకాకుండా నవంబర్ 21 నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా 26 టీ20 లకు సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇందులో భారత జట్టు 21 టీ20 మ్యాచ్లలో విజయం సాధించింది. అంతేకాదు వరుసగా 11 ద్వైపాక్షిక సిరీస్లలో కూడా టీమిండియా విజయం సాధించి అదరగొట్టింది. ఒక్కటి కూడా ఓడిపోలేదు అని చెప్పాలి. కాగా భారత సారథిగా ఇవే ఇప్పటివరకు అత్యధిక విజయాలు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు వరుసగా ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఇక సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు సిరీస్ అందించిన ఏకైక కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: