టీమ్ ఇండియా జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు రవీంద్ర జడేజా  ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఇక టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి  తన స్పిల్ బౌలింగ్ తో వికెట్లు పడగొడుతూ తన బ్యాటింగ్తో మెరుపుల మెరూపిస్తూ అటు మైదానంలో ఎంతో మెరుపు వేగంతో ఫీలింగ్ చేస్తూ అతని లాంటి ఆల్ రౌండర్   మాకు ఉంటే బాగుండు అని ప్రత్యర్థి జట్లు కుళ్లుకునే విధంగా అతని ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది వరల్డ్ కప్ ముందు రవీంద్ర జడేజా గాయం బారిన పడ్డాడు.


 ఇక జట్టులో కీలక ఆటగాడు అయినా రవీంద్ర జడేజా గాయం బారిన పడటంతో అటు టీమ్ ఇండియా వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇక మోకాలి గాయం బారిన పడిన రవీంద్ర చివరికి శస్త్ర చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత పట్టుదలతో ఎంతో వేగంగా కోలుకున్నాడు అని చెప్పాలి. అయితే మోకాలి గాయ నుంచి కోలుకున్నప్పటికీ అతను ఫిట్నెస్ సాధించాడా లేదా అని అనుమానాలు వ్యక్తం అయ్యాయి.


 ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీలో ఆడాలి అంటూ బీసీసీఐ అతనికి సూచించింది. ఈ క్రమంలోనే సౌరాష్ట్ర తరఫున అతను బరిలోకి దిగాడు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్ అందింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్నెస్ టెస్టులో క్లియర్ అయ్యాడు అన్నది తెలుస్తుంది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ తో పాల్గొనేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీ అనుమతించింది అని చెప్పాలి. కాగా జడేజా చివరిసారిగా 2022 ఆగస్టులో దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ లో భారత తరఫున ఆడగా ఆ తర్వాత మోకాలి శస్త్ర చికిత్స కారణంగా 5 నెలల నుంచి భారత జట్టుకు దూరంగానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: