
ఏకంగా తండ్రి కొడుకులను అవుట్ చేసిన ఏకైక భారత బౌలర్గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. 2011లో శివ నారాయన్ చంద్ర పాల్ ను అవుట్ చేసిన అశ్విన్ అతని కొడుకు తేజ్ నారాయన్ ను అవుట్ చేసాడు. ఇలా టెస్ట్ క్రికెట్లో తండ్రి కొడుకులను అవుట్ చేసిన తొలి భారతీయ బౌలర్గా నిలిచాడు. అయితే ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన వారు కేవలం ఐదు మంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఇంగ్లాండ్ ప్లేయర్ ఇయాన్ బోధమ్ టెస్ట్ క్రికెట్ లో ఇలా తొలిసారి తండ్రి కొడుకులను అవుట్ చేసి సరికొత్త రికార్డు చేయించాడు. న్యూజిలాండ్ కి చెందిన లాన్స్ కీయిర్న్స్ అతని కొడుకు క్రిస్ కీయిర్న్స్ ల వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు.
వసీం అక్రమ్ : పాకిస్తాన్ మాజీ ప్లేయర్ వసీం అక్రమ్ కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు లాన్స్ కీయిర్న్స్ అతని కొడుకు క్రిస్ కీయిర్న్స్ ల వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు
మిచెల్ స్టార్క్ : ఇక అశ్విన్ లాగానే శివ నారాయణ చంద్రపాల్ అతని కొడుకు తేజ్ నారాయన్ చంద్రపాల్ వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్నాడు స్టార్క్.
సైమన్ హార్మర్ : దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ కూడా శివ నారాయన్ చంద్రపాల్.. తేజ్ నారాయణ చంద్రపాల్ వికెట్లు తీశాడు అని చెప్పాలి.