ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మను అర్ధంతరంగా సారధ్య బాధ్యతలు  నుంచి తప్పించడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఉన్న అన్ని టీమ్స్ కూడా రోహిత్ లాంటి కెప్టెన్ కావాలి అని కోరుకుంటున్నాయి. ఒకవేళ రోహిత్ ముంబైని వదిలి తమ టీమ్ లోకి వస్తే కెప్టెన్సీ  అతని చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అతని కోసం ఎన్ని కోట్లు పెట్టడానికైనా రెడీగా ఉన్నాయి. అలాంటి రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం ఏంటి అని క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


 అయితే రోహిత్ శర్మకు అసలు కెప్టెన్సీ చేయడమే రాదేమో అన్నట్లుగా గుజరాత్ జట్టు నుంచి హార్దిక్ పాండ్యాను తమ టీం లోకి తీసుకొని.. మరి అతని చేతిలో కెప్టెన్సీ పెట్టింది జట్టు యాజమాన్యం. దీంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించిన రోహిత్ శర్మ ఇక ఏడాది ఐపిఎల్ సీజన్లో మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో ఒక సాదాసీదా ఆటగాడుగానే ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ అభిమానులు ఎక్కడ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఇక హార్దిక్ పాండ్యా సహా అటు ముంబై ఇండియన్స్  కోచింగ్ సిబ్బంది ఎక్కడికి వెళ్లినా రోహిత్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి అని చెప్పాలి.



 ఇకపోతే మరో మూడు రోజులు ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా.. ఇటీవల ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ బౌచర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో ముంబై ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతుంది అనే విషయం కంటే ఇక రోహిత్ ను కెప్టెన్సీ  నుంచి తప్పించడం గురించి ఎక్కువగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ముంబై కెప్టెన్ అయ్యాక మీరు రోహిత్ తో మాట్లాడారా అన్న ప్రశ్న హార్దిక్ కి ఎదురు కాగా.. అవును.. కాదు అంటూ సమాధానం ఇచ్చాడు. రోహిత్ వరుస ప్రయాణాలు చేస్తున్నాడంటూ అసలైన సమాధానం దాటవేశాడు హార్దిక్. రోహిత్ ను ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పించారు అన్న ప్రశ్నకు కోచ్ బౌచర్ మౌనం వహించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: