బుల్లితెరపై గత ఎనిమిది సవత్సరాలుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్ధస్త్‌. ఈ షో ద్వారా చాల మందికి జీవనోపాధి కల్పిస్తుంది. ఇప్పటికప్పుడు కొత్తవారికి అవకాశాలు ఇస్తూనే వస్తుంది ఈ షో. ఇక జబర్ధస్త్‌లో ఇమ్మాన్యుయల్ గురించి తెలియని వారంటూ ఉండరు. తక్కువ సమయంలోనే ఎక్కవ గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్. ఇక ఈ షోలో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఓ రైజింగ్ స్టార్ గా ఎదిగిపోయారు.

జబర్ధస్త్ ద్వారా తాను ఎదగడంలోనూ ఈ యంగ్ కమెడియన్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు. జబర్ధస్త్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో తనదైన మార్క్ చూపిస్తూ పలు స్కిట్స్‌కు మంచి రేటింగ్ వచ్చేలా చేయడంలోనూ ఇమ్మాన్యుయల్ విజయం సాధిస్తున్నాడనే టాక్ ఉంది. ఇక వర్షతో ఇమ్మాన్యుయల్ లవ్ స్టోరీ కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. తాజాగా ఇమ్మాన్యుయల్ పాల్గొంటున్న శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ షోలో జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిదండ్రులు, అన్నను పరిచయం చేశారు.

ఈ సందర్బంగా ఇమ్మాన్యుయల్ ఒక్కసారిగా బాగోద్వేగానికి గురైయ్యాడు. ఇక తను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్ళ అన్న అని చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రి ఎప్పుడు ఇమ్మాన్యుయల్ ని ప్రోత్సహిస్తూనే ఉండేవాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇమ్మాన్యుయల్ కి బుల్లితెరపై అంతటి క్రెడిట్ రావడానికి వర్ష కూడా కారణం అని అతని తల్లి చెప్పుకొచ్చింది. ఇక ఈ స్టేజ్ మీదే ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుంది. ఇంత మంచి అబ్బాయిని తనకు ఇచ్చినందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పింది.

ఇక అయితే ఇదే సమయంలో ఇమ్మాన్యుయల్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన కొడుకు వల్ల వర్షకు ఎలాంటి సమస్య రాదని ఆమె స్టేజ్‌పై చెప్పింది. తన కొడుకు చాలా మంచివాడని తెలిపింది. మొత్తానికి జబర్ధస్త్ ఇమ్మాన్యుయల్ తల్లిని వర్ష ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురికావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: