ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ ఫీవర్ మొదలైందనే చెప్పాలి.. తాజాగా కంటెస్టెంట్ల లిస్టులో కొన్ని క్రేజీ పేర్లు వినిపిస్తూ ఉండడంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది గ్లామర్ ముద్దుగుమ్మలు అడుగుపెడుతున్నారు అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వగా.. ఇప్పుడు మరొక ఇద్దరి పేర్లు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక వారే తల్లి కూతుర్లుగా సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సురేఖవాణి, సుప్రీత.. వీరిద్దరూ తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంపికయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న వీరిద్దరూ అందం విషయంలో తల్లి కూతుర్లు ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. అలా గ్లామర్ ప్రపంచంలో మరింత గ్లామర్ వలకబోస్తూ భారీ క్రేజ్ సంపాదించుకున్న వీరికి తాజాగా హౌస్ లోకి వెళ్లడానికి ఆఫర్ లభించిందట. ఇక వీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే వీరితోపాటు కార్తీకదీపం ఫేమ్ శోభిత శెట్టి, శ్వేతా నాయుడు, ఈటీవీ ప్రభాకర్ , సింగర్ మోహన భోగరాజు,  దీపిక పిల్లి తదితర పేర్లు కూడా వినిపిస్తున్నాయి.


ఇకపోతే సురేఖవాణి నటిగా అందరికీ పరిచయమే అయినా ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో హాట్ వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈమె కూతురు కూడా సోషల్ మీడియా సెలబ్రిటీ అని చెప్పవచ్చు. హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేస్తూ తన లైఫ్ లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న వీరిద్దరూ సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: