కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఊహించని సందర్బరాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా వేడుకలలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి.. అనుకున్న సమయంలో వేదికపై ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు బ్యాలెన్స్ తప్పి మాట్లాడడం వల్ల ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది.. తాజాగా ఇలాంటి సంఘటన ఇప్పుడు మరొకటి చేసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం బీమ్ బుష్ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది..


సినిమా థీమ్ జనాల్లోకి వెళ్లాలని ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ఈవెంట్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే స్పేస్ నుంచి వచ్చినట్లుగా హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణాలు ఆ దుస్తులు వేసుకొని స్టేజ్ పైన కనిపించారు.. ఈవెంట్ అయ్యేవరకు వారు అదే దుస్తులలో ఉన్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. దీంతో అతని స్టేజ్ పైకి పిలిపించి స్పీచ్ ఇవ్వడం కోసం యాంకర్ గీతా భగత్ ఆహ్వానించారు.. అయితే రచ్చ రవి తన స్టైల్ లో స్పీచ్ ఇచ్చిన అనంతరం.. యాంకర్ గీతా భగత్ పైన పలు రకాల డబల్ మీనింగ్ డైలాగులు వేశారు..


ఓం భీమ్ బుష్ గీత నీది మాయమైపోయింది నా దగ్గరకు వచ్చేసింది అంటూ డబల్ మీనింగ్ డైలాగులతో రచ్చ రవి కామెంట్స్ చేశారు.. దీంతో యాంకర్ గీతా భగత్ తో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. దీంతో రచ్చ రవి నీ మనసు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసిన ఈ విషయం యాంకర్ కి కోపం తెచ్చి పెట్టింది.. దీంతో వెంటనే ఆమె కూడా ఓం బీమ్ బుష్ నీది కూడా మాయమైపోయింది అంటూ.. అదే బుర్ర పని చేయలేదు అంటూ మధ్యలో  స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: