టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు దుర్గారావు. రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో కూడా పలు రకాల వీడియోలతో ఓ రేంజ్ లో పాపులర్ అయిన దుర్గారావు అతని భార్య స్టెప్పులకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. దీనివల్ల వారు సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు ఈ దంపతులు. గతంలో జబర్దస్త్ ఇతరత్రా కామెడీ షోలలో కనిపించేవారు. కానీ ప్రస్తుతం వీరి క్రేజ్ అయితే తగ్గినట్లుగా కనిపిస్తోంది.


అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ దంపతులు తమ యూట్యూబ్ సంపాదన గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో రెండు ఇల్లులు కట్టుకున్నట్లు వెల్లడించారు. యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా అలా వచ్చిన డబ్బులను తన ఇంటిని క్రమక్రమంగా పూర్తి చేసుకున్నామని తెలియజేశారు. ఇలా రెండిల్లు కట్టారని తెలియడంతో యూట్యూబ్ ఆదాయం ఎంత ఉందని విషయంపై ప్రశ్నించగా తమకు యూట్యూబ్ నుంచి ప్రతినెల రూ .35 వేల నుంచి రూ .45 వేల రూపాయల వరకు వస్తుందని వెల్లడించారు.


అలాగే ఏదైనా సినిమా షూటింగ్ వల్ల యూట్యూబ్ వీడియోలు చేయకపోతే నెలకు పదివేల రావడం కూడా కష్టమే అని.. కొన్నిసార్లు లక్ష రూపాయల వరకు వస్తూ ఉంటుందని వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న దుర్గారావు కూడా బిగ్ బాస్ లోకి వెళ్లి తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించి ఎంతోకొంత సంపాదించుకోవాలని ఆశపడుతున్నట్లు తెలియజేశారు. తన పిల్లల చదువు కోసం కష్టపడుతున్నామంటూ తెలిపారు.దీంతో ఈ విషయం విన్న పలువురు నెటిజన్స్ సైతం దుర్గారావు బిగ్ బాస్ కార్యక్రమంలోకి అవకాశం కల్పించాలి అంటూ వైరల్ గా చేస్తున్నారు. మరి కామన్ మ్యాన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి దుర్గారావు వెళ్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: