ప్రభుత్వాలు ఎక్కువగా ఈమధ్య డిజిటల్ ఇండియా వైపే మొగ్గు చూపుతున్నాయి. అందుకోసం అనేక రకాల అయినటువంటి యాప్స్ లను విడుదల చేయడం జరిగింది. ఇక వీటిలో బాగా ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి కొన్ని యాప్స్ లను, కొన్ని మొబైల్ నెంబర్లను తెలుసుకుందాం.

1).BHARAT KE VEER:
దీని ద్వారా విధినిర్వహణలో వీర జవాన్లు చనిపోతే.. దీనిద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించవచ్చు.

2).cVIGIL;
ఈ యాప్ ద్వారా, ఎన్నికలు జరిగేటప్పుడు ఏదైనా రిగ్గింగ్ చేస్తున్నటువంటి సమాచారాన్ని, దీని ద్వారా మీరు ఎన్నికల కమిషనర్ కు పంపించవచ్చు.
3).MADAD:
ఇతర దేశాలలో వెళ్లిన మన భారతీయులు అక్కడ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ యాప్ ను రూపొందించారు.



4).UTS:
మన ఇండియాలో రైల్వే టికెట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ యాప్ ను విడుదల చేశారు.
5).M PASSPORT:
ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా మన పాస్ పోర్ట్ ని అప్లై చేసుకోవచ్చు.
6).1091:
ఈ నెంబరు కేవలం మహిళలకు అత్యవసర ఆపద సమయంలో బాగా ఉపయోగపడుతుంది.
7).AAYKAR SETU:
దీని ద్వారా మనము కొత్త పాన్ కార్డు అప్లై చేయవచ్చు, అంతే కాకుండా దీని ద్వారా టాక్స్ లు కట్టవచ్చు.


8).011-1078:
వరద బాధితులకు, భూకంపం వచ్చిన చోట, ప్రదేశాలలో ఈ హెల్ప్లైన్ ఉపయోగించడం వల్ల వారికి తగిన సహాయం చేస్తారు.

9).KISAN SUVIDHA:
ఈ యాప్ ను కేవలం రైతుల కోసమే తయారు చేయబడినది. దీని ద్వారా వాతావరణంలోని మార్పులను, ఆరోజు ఉండేటువంటి మార్కెట్ రేటు లను, మరియు పంట రక్షణ కోసం ఏమేం చేయాలో వంటి ఉపయోగాలు తెలుసుకోవచ్చు.10).1947:
ఆధార్ గురించి ఎటువంటి సమస్యలు ఉన్న, మీ మొబైల్ నుంచి ఈ నెంబర్ కి కాల్ చేస్తే వారు మన సమస్యలను పరిష్కరిస్తారు.11).61098:
ఈ యాప్ ద్వారా పిల్లలతో వెట్టిచాకిరీ గాని, ఆడపిల్లలను హింసించడం వంటివి ఎవరైనా చేస్తుంటే.. వారు ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు.
ఇక ఇవి ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే యాప్స్ అని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: