ఇంటర్నెట్ డెస్క్: మిలియన్ల ఏళ్ల క్రితం భూమి ఒకసారి సూర్యడి చుట్టూ పరిభ్రమించడానికి 444-419 భ్రమించేదట. అంటే అన్ని సార్లు తన చుట్టూ తాను తిరిగేది. ఆ తర్వాత కొన్ని వేల ఏళ్లకు భూమి వేగం 410కి తగ్గింది. అయితే ప్రస్తుత సమయానకి ఇది 365 మాత్రమే భ్రమిస్తోంది. అంటే అప్పటితో పోల్చితే వేగం తగ్గింది. కానీ ప్రస్తుతం భూమి మళ్లీ వేగం పుంజుకుంటోంది. అది కూడా నెమ్మదిగా కాదు. ఒక్కసారిగా వేగం పెంచింది. అయితే భూమి వేగంలో మార్పులకు అనేక కారణాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి కారణం కావచ్చని, చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండడం కూడా ఒక కారణమని వారు చెబుతున్నారు

గత కొన్నేళ్ల నుంచి భూమి చాలా వేగంగా పరిభ్రమిస్తుందని సైంటిస్టులు నిర్దారించారు. సాధారణంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగే సరికి 24 గంటల సమయం పడుతుంది. గంటకు 60 నిముషాలు.. నిముషానికి 60 సెంకండ్లు. ఇలాంటి రోజులు 365 గడిస్తే ఓ ఏడాది. అయితే ఇకపై ఈ లెక్క మారనుంది. అంటే.. నిమిషానికి 60 సెకన్లు కాదు, 59 సెకన్లే కానున్నాయి. ఇలా నిముషం నుంచి ఓ సెకనును తీసేయడానికి శాస్త్రవేత్తలు ఆలోచన కూడా చేస్తున్నారు.

గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని సైంటిస్టులు కచ్చితంగా చెప్తున్నారు. గతంలో సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉండగా.. 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో ఒకసారి సైంటిస్టులు 1 మిల్లీ సెకన్ సమయాన్ని అడ్జస్ట్ చేశారు. దీంతో కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. అయితే ఈ సారి ఏకంగా 1 సెకన్‌ను అడ్జస్ట్ చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టైమ్‌ను ఎలాంటి ఇబ్బంది రాకుండా అడ్జస్ట్ చేయడం ఎలా అనేదానిపై శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏది ఏమైనా భూమి వేగం పెరగడమనేది ఆందోళన కలిగించే అంశమే. మరి దీనికి ఎలాంటి పరిష్కారం లభ్యమవుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: