రైతులు ఎప్పటి లాగానే పొలం వరకు వెళ్లి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలోనే ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలో నుంచి వింతైన శబ్దాలు వినిపించాయి. అయితే మొదట ఈ శబ్దాలను పట్టించుకోని రైతులు అంతకంతకు ఆ శబ్దాలు ఎక్కువ కావడంతో ఏంటా అని వెళ్లి చూసారు. దీంతో ఒక్కసారిగా వారి వెన్నులో వణుకు పుట్టినంత పని అయింది అని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయ బావిలో ఏకంగా చిరుత పులి ప్రత్యక్షమైంది. బయటికి ఎలా రావాలో తెలియక ఇక సహాయం చేయాలంటూ దాని భాషలో గట్టిగా అరుస్తూ ఉంది చిరుత పులి. దీంతో ఏం చేయాలో ఆ రైతులకు పాలు పోలేదు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు బావిలో చూడగా చిరుతపులీతో పాటు ఒకపిల్లి కూడా బావిలో పడింది అని  గుర్తించారు. అయితే పిల్లిని వేటాడే క్రమంలో ఇకఎటు వెళ్తున్నాయో కూడా తెలియకుండా ఒక్కసారిగా చిరుత పులి, పిల్లి బావిలో పడిపోయినట్లు అటవీ శాఖ అధికారులు భావించారు. ఈక్రమంలోనే ఆ బావిలోంచి ఎలా బయటికి రావాలో తెలియక చివరికి ముక్కుతూ ములుగుతూ అరవడంతో వింత శబ్దాలు విన్న రైతులు గమనించినట్లు తెలుస్తోంది.


 అయితే వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఇక బావిలో పడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పోరాడుతున్న చిరుత పులిని పిల్లిని కూడా రక్షించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే బోన్ సహాయంతో చేరుతను బుట్ట సహాయంతో పిల్లిని కూడా ఫారెస్ట్ అధికారులు రక్షించారు అని చెప్పాలి.  చివరికి రెండు జంతువులు కూడా ప్రాణాలతో బయటపడ్డాయ్. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: