టీమిండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి కష్ట సమయాలలోనైనా సరే ఇండియా టీంకు విజయాన్ని చేకూర్చడంలో ఈ క్రికెటర్ దిగ్గజా హస్తం ఉంటుందని చెప్పవచ్చు.. ఈయన భారతరత్న కూడా అందుకున్నారు. ఈ రోజున 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు నెలకొన్నాయి. సచిన్ టెండుల్కర్ 1989 నవంబర్ 16వ తేదీన సచిన్ కరాచీలో ఫాక్కుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.


ఆ తర్వాత 1990 ఆగస్టు 14న టెస్టుల్లో సచిన్ మొదటిసారిగా సెంచరీ నమోదు చేయడం జరిగింది. 1994లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 110 పరుగులు చేసి మొదటి సారి సెంచరీ సాధించారు. 1996లో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు 2006 డిసెంబర్ 1న దక్షిణాఫ్రికా తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడి సచిన్ పది పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఆ తరువాత 2010లో దక్షిణాఫ్రికాత జరిగిన వన్డేలో 200 పరుగులు చేసి వన్డేలు డబుల్ సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్ గా పేరు సంపాదించారు సచిన్ టెండుల్కర్.



2012లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి మొత్తం 100 సెంచరీలు పూర్తి చేశారు. ఇలా 100 సెంచరీలు పూర్తి చేసిన మొదటి క్రికెటర్ గా రికార్డుకు ఎక్కారు సచిన్.2013 నవంబర్ 16న వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తన వ్యక్తిగత 200 మ్యాచ్లను ఆడిన అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పడడం జరిగింది.. ఆ తర్వాత క్రికెట్లకు గుడ్ బై చెప్పి దాదాపుగా పదేళ్లు పూర్తి చేసుకున్నారు సచిన్. ఈ రోజున సచ్చిన్ 50వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ముఖ్యంగా అభిమానులు మాత్రం ఈయనని క్రికెట్ దేవుడుగా పిలుచుకుంటూ ఉంటారు. సచిన్ టెండుల్కర్ 2014 ఫిబ్రవరి 4వ తేదీన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరెన్నో అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: