సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇందులో అడవుల్లో ఉండే జంతువులు లేదా పాములకు సంబంధించిన వీడియోలు కొన్ని అయితే.. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఎన్నో ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ఎంతో మంది చూసే ఉంటారు. ఇక ఇలా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతున్నాయి.



 ఇక ఇలాంటి వీడియోలు ఎంతోమందిని షాక్ కి గురి చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే ట్విటర్ వేదికగా ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కూడా తలగోక్కుంటున్నారు అని చెప్పాలి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాక ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇలాగే సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తారు అనడంలోనూ అతిశయోక్తి లేదు. ఈ కార్ యాక్సిడెంట్ చూసిన తర్వాత మీ మనసులో కూడా చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి.




 ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక కారు వేగంగా దూసుకు వచ్చి ఒక పిల్లర్ను ఢీ కొట్టింది. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఇక పిల్లర్ కూడా కాలును చీల్చేసి ఏకంగా కారు అద్దం వరకు వెళ్ళింది. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడ చీల్చినట్లు కనిపించకుండా ఆ పోల్ కారు అద్దం వద్ద కనిపించడం గమనార్హం. ఇదేలా జరుగుతుంది ఒకవేళ పోల్ కీ ఢీకొట్టినప్పుడు పోల్ కారును చీల్చేస్తే.. ఆ చీలిక కనిపిస్తుంది కదా చీలిక లేకుండానే ఆ పోల్ ఎలా కార్ మధ్యలోకి వెళ్లిందో అర్థం కాక అందరూ తలకోక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: