ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ చాలా విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ఈ నేపథ్యంలో భాగంగానే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ అయిన eBikeGo త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఈ కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ పేరు eBikeGo Rugged. ఇక ఇది ఇండియా మార్కెట్లో 2021 ఆగష్టు 25 న విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా తెలిపడం జరిగింది.eBikeGo కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త Rugged ఒక బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఫీచర్లు ఇంకా ఆధునిక పరికరాలతో అందించబడుతుంది. ఇక ఈ స్కూటర్ గురించి అధికారిక సమాచారం అయితే ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ లాంచ్ సమయంలో కంపెనీ ఈ స్కూటర్ అన్ని వివరాలను వెల్లడిస్తుంది.

ఇక ముంబైకి చెందిన eBikeGo తన డెలివరీ సర్వీస్ 2017 లో ప్రారంభించడం జరిగింది. ఈ కంపెనీ మొదట్లో భారతీయ తయారీదారుల నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడం ప్రారంభించడం జరిగింది.అయితే ఇక తక్కువ బలం కారణంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీ సర్వీస్ కి అంత బాగా ఉపయోగపడనివి కంపెనీ గుర్తించడం జరిగింది.ఇక డెలివరీ సర్వీస్ కి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో దృడంగా ఉండాలి.కాబట్టి కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు డెలివరీ ఫ్లీట్ కోసం బలమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది.ఇండియన్ రోడ్లకు బాగా అనుకూలంగా ఉండే బైకులను డిజైన్ చేసి అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయాలనుకుంటున్నామని కంపెనీ చెబుతోంది.ఇక ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) ఆమోదించడం జరిగింది.డెలివరీ భాగస్వామి ఇంకా వ్యాపార భాగస్వాముల నుండి వచ్చిన సూచనల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపొందించబడినట్లు కంపెనీ తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: