హోండా స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ విపణిలోకి ఎప్పటికప్పుడు సరికొత్త వాహనాలు వస్తున్నాయి. "మోడ్రన్ స్టైల్, హై క్వాలిటీ, విశ్వసనీయమైన పనితీరు మరియు ఇప్పటి వరకు మరే ఇతర కంపెనీ పరిచయం చేయనటువంటి వాహనాలు అందిస్తున్నారు. యాక్టివా వారసత్వాన్ని కొనసాగిస్తూ, హోండా యాక్టివా ను సరికొత్తగా విడుదల చేసింది.
ఆటో ఎక్స్పో-2018 లో ప్రారంభించిన యాక్టివా 5జీని కొత్తగా అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రామాణిక మోడల్ ధర రూ. 52,460 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా నిర్ణయించింది.డీలక్స్ వెర్షన్ ధర రూ. 54,325(ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) గా ఉంది.
స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయనీ, డెలివరీలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించినట్టు హోండా ఒక ప్రకటనలో తెలిపింది.హోండా టూ వీలర్స్ హోండా యాక్టివా 5జీ స్కూటర్‌ను తొలుత ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది.
యాక్టివా పేరు సక్సెస్‌కు చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్లో మరియు హోండా లైనప్‌లో యాక్టివా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది. హోండా స్కూటర్ల కుటుంబంలోకి కొత్తగా వచ్చి చేరిన యాక్టివా 5జీ హోండా మంచి ఫలితాలు సాధించిపెట్టనుంది.