కాంగ్రెస్‌లో అసమ్మతి గళం వినిపిస్తున్న జగ్గారెడ్డితో కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న సమస్యలు , అభిప్రాయ భేదాలపై చర్చించామని జగ్గారెడ్డితో భేటీ తర్వాత కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. జగ్గారెడ్డి చిన్న నాటి మిత్రుడు కావడంతో వచ్చి మాట్లాడానని.. ఆయన తనకు జరుగుతున్న పరిణామాలు చెప్పారని.. పార్టీ అధిష్టానంపై జగ్గారెడ్డి వినయ విధేయతతో ఉన్నారని కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. అధిష్టానంతో మాట్లాడాలని తాను జగ్గారెడ్డికి సూచించానని..  అవసరం అయితే తాను వస్తానని చెప్పానని కుసుమ కుమార్ వివరించారు. పార్టీ సైనికుడిగా వచ్చి జగ్గారెడ్డితో చర్చించానని.. నేను వ్యక్తిగతంగానే వచ్చానని.. ఎవరి తరపున దూతను కాదని కుసుమ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని సూచించానని.. మొన్న ఆవేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న జగ్గారెడ్డి ఇప్పుడు అలాంటిది ఏం లేదన్నారని కుసుమ కుమార్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: