చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొన్ని సంస్థలను కేంద్రం నిషేధించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థలు, రిహాబ్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఇండియా ఫౌండేషన్ కేరళ వంటి సంస్థలను కేంద్రం నిషేధం విధించింది.


వీటిని చట్టవిరుద్ధ కార్యకలాపాల సంస్థలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అన్ లాఫుల్ యాక్టివిటీ, ప్రివెన్షన్ యాక్ట్ 1967, ప్రకారం కేంద్ర ప్రభుత్వం 27 సెప్టెంబర్, 2022 న వీటిపై నిషేధం విధించిందని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి సంస్థల కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్బురాజన్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: