తెలుగు రాష్ట్రాల మధ్య ఇవాళ వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. ఇవాళ లాంఛనంగా మొదలైనా.. సోమవారం నుంచి వందేభారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిన్నటి నుంచే వందేభారత్ రైలు బుకింగ్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. ఈ వందే భారత్ ద్వారా విశాఖకు సికింద్రాబాద్ నుంచి జర్నీ సమయం బాగా తగ్గబోతోంది. దీనికి తోడు ఈ రైలు పరిమితమైన స్టేషన్లలోనే ఆగడం కూడా దూరం ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యంగా మారింది. మరి ఆ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..


వందేభారత్ రైలు చార్జీల వివరాలు  ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ టు వరంగల్  రూ. 520/- చార్జి ఉంది. ఇక సికింద్రాబాద్ టు ఖమ్మం - 750/- చార్జి ఉంది. సికింద్రాబాద్ టు విజయవాడ - 905/- చార్జి ఉంది. సికింద్రాబాద్ టు రాజమండ్రి - 1365/- చార్జి ఉంది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 1665/-గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: