చంద్రబాబుల‌ సొంత ఊళ్ళో ఎస్సీలకు ఎవరి హయాంలో మేలు జరిగిందో చర్చిద్దామా అని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ సవాల్ స‌వాలు విసిరారు. ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై టీడీపీ మీడియా తప్పుడు రాతలు రాస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిప‌డ్డారు. అలాగే పవన్ తీరుపైనా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్  మండిపడ్డారు. టీడీపీ, రామోజీ రాతలనే పవన్‌ కళ్యాణ్‌ వళ్లిస్తాడన్న ఎంపీ నందిగం సురేష్... ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న చంద్రబాబును పవన్‌ కళ్యాణ్‌ పశ్నించాలి కదా అన్నారు.


పవన్ చంద్రబాబును  ప్రశ్నించకపోగా, ఆయన చంకనెక్కి నీతులు చెబుతాడని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. పవన్‌ టీడీపీ వారు ఇచ్చే స్క్రిప్ట్‌ చదవడం మానేసి, తన సొంతగా ఏదైనా ఎజెండా ఉంటే మాట్లాడితే బాగుంటుందన్న ఎంపీ నందిగం సురేష్.. టీడీపీ, రామోజీ రాసే రాతలే పవన్‌ మాట్లాడుతున్నాడన్నారు. లోకేష్‌ ఖాళీగా ఉండి ఏం చేస్తాడు.. పాదయాత్ర చేసుకోనివ్వండని ఎంపీ నందిగం సురేష్ సూచించారు. ఆయన్ను అడ్డుకోడానికి లోకేష్‌ ఏమీ పెద్ద పనోడు అయితే కాదని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. లోకేష్ పాదయాత్ర వల్ల వాళ్ళ పార్టీలో మార్పు సంగతి ఏమోగానీ, శరీరంలో మార్పు వస్తుందేమోనని సెటైర్‌ వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: