ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్, ఎవిడెన్స్ చట్టాల్లో చాలా మార్పులు రానున్నాయని అమిత్ షా అంటున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారులపై కఠినమైన శిక్షలు విధించబడ్డాయన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్ లు అందించారు. ఈ వ్యాన్ లు.. కేసులను త్వరగా ఛేదించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతుందన్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు.. 6 సంవత్సరాలు కంటే ఎక్కువ శిక్ష విధించే కేసులలో చాలా ముఖ్యమైందన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామన్న అమిత్ షా.. ఈశాన్య భారతంలో... ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు పోలీసుల పనిలో సేవ లేదు.. ఇప్పుడు అది మారిందని.. కరోనా సమయంలో... ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని హోం మంత్రి మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: