అందం అంటే  అమ్మాయి ఒక్కతేనా అబ్బాయిల గురించి కూడా కొంచం పట్టించుకోండి అని అనుకునే మగవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది..అందం అనే అమ్మాయి అని అబ్బాయి కాదు అని కాదు..అందం అంటే ఎవరికైనా సరే వర్తిస్తుంది..అయితే అబ్బాయిలకి ఎన్నో బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి..ఈ టిప్స్ అబ్బాయిలు ఫాలో అయితే చాలా మీరు ఎంతో హాండ్సమ్ గా కనిపిస్తారు..మరి అవేంటో మీరు ఓ లుక్ వేయండి..

 boys shave కోసం చిత్ర ఫలితం

షేవ్ చేసుకునే విధానం

చాలా మంది షేవ్ చేసుకోవడం అనగానే బ్రష్ కూడా చేసుకోకుండా ముఖాన్ని బరా బరా లాగేస్తారు..నూటికి 90 శాతం మంది చేసే పని ఇదే..కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు..ఎందుకంటే షేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్నానం చేసిన తరువాత షేవ్ చేసుకోవడం ఎంతో ఉత్తమం అలా చేస్తేనే చర్మం మృదువుగా ఉంటుంది గాయాలు కావు ఈసారి ఈ పద్దతిని వాడి చూడండి.

అయితే షేవ్ చేసిన తరువాత గెడ్డం గరుకుగా ఉంటుంది అలా కాకుండా స్మూత్ గా ఉండాలి అంటే షేవ్ చేసుకునే సమయంలో క్రీం పై కొంచం హెయిర్ కండిషనర్ కలిపి షేవ్ చేసుకుంటే సరిపోతుంది.

 

జుట్టు సమస్యలు

ఇప్పుడు ఉన్న  కాలంలో అనేకమందిని పట్టి వేదిస్తున్న సమస్య హెయిర్ ఫాల్....30 దాటకముందే బట్టతల వచ్చేస్తోంది...అయితే ఇది అనేక మందికి ఉన్న సమస్యే అయితే అలాంటి వారు.. ముందు ఉన్న జుట్టును కాస్త చిన్నగా కత్తిరించి.. ఆ జుట్టుని పక్కగా దువ్వితే సరిపోతుంది...బట్టతలని కాస్త కవర్ చేసుకోవచ్చు.

 boys hair loss కోసం చిత్ర ఫలితం

ఒక్కోసారి షేవింగ్ చేసుకుంటుంటే పొరపాటున గాట్లుపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ గాయం వద్ద లిప్ బామ్ రాయండి. రక్త స్రావాన్ని తగ్గించి త్వరగా మానిపోవడానికి సహాయపడుతుంది.

 

అందమైన పండ్లు

చాలా మంది చాలా అందంగా ఉంటారు కానీ వారి పళ్ళు మాత్రం పసుపు పచ్చగా ఉంటాయి..అలాంటప్పుడు వారు ఎంత అందంగా ఉన్నాసరే పళ్ళ వలన అందవిహీనంగా కనిపిస్తారు..అలాంటివాళ్లు ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్ది చుక్కల నిమ్మరసాన్ని కలిపి.. దానిని దంతాలకు రుద్దితే.. పచ్చదనం పోవడమే కాకుండా పళ్ళు తెల్లగా మెరుస్తాయి.

 boys skin care కోసం చిత్ర ఫలితం

చర్మం నిగారింపు కోసం

 అంతేకాదు గంధం చెక్కని సానమీద అరగదీసి..వచ్చిన మిశ్రమానికి కొంచం పాల మీగడ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించడం వలన ముఖం ఎంతో నిగారింపు చెందుతుంది..అంతేకాదు శనగ పిండితో పెట్టుకునే నలుగు వలన కూడా చర్మం ఎంతో మెరిసే పోతూ ఉంటుంది.మరి అబ్బాయిలు ఇంకెందుకు మరి ఆలోచన చేయకుండా మొదలు పెట్టండి.


మరింత సమాచారం తెలుసుకోండి: