ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈరోజు హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్ పై అంశాల వారీగా వివరణ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కు నిమ్మగడ్డ రమేష్ రిప్లై పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల ప్రక్రియ ఫిబ్రవరిలోనే మొదలుపెట్టామని చెబుతోందని అది వాస్తవం కాదని అన్నారు. 
 
సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తనను తొలగించటానికి సంబంధించి ఆయన అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన లేఖను తానే రాశానని నిమ్మగడ్డ రమేష్ అంగీకరించారు. గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు అధిక సంఖ్యలో ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. 
 
ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్ లలో కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. ఎవరికి తీర్పు అనుకూలంగా వస్తుందో అని ఏపీ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: