మంత్రి వెల్లంపల్లి అసలు సభలో సభ్యుడే కాదని... ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారని టీడీపీ మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. బిల్లులన్నీ సెలక్ట్ కమిటీ ముందు ఉన్నాయని.. గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారన్నారు ఆయన. మూడు నెలలు అయ్యింది కాబట్టి బిల్స్ పాస్ చూసుకుంటామంటే కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. అప్రోప్రియషన్ బిల్ పాస్ అవ్వక పోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు యనమల.

 

కౌన్సిల్‌లో ఇంత మంది మంత్రులు ఎందుకు వచ్చారని ఆయన నిలదీశారు. మండలిలో నిన్న జరిగిన లాంటి ఘటనలు మళ్ళీ జరగ కూడదని ఆయన పేర్కొన్నారు. మనీ బిల్ కాబట్టి 14 రోజుల తరువాత ఆటోమాటిక్‌గా బిల్ పాస్ అవుతుందని... లోకేష్‌ను కొట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: