మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేవారు. తమకు అన్న అయినప్పటికీ తండ్రిలా సాకారంటూ ఉద్వేగతభరితమైన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఆయనకు తమ్ముడిగా పుట్టడమే ఒక అదృష్టమైతే ఆయన మంచి లక్షణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టమన్నారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని, మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. చిరంజీవికున్న లక్షలాది అభిమానుల్లో తాను మొదటివాడినని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణమన్నారు. కరోనా సమయంలో పనుల్లేక ఎంతోమంది కార్మికులు అల్లాడిపోయారని, వారి ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపించేవారని, కోరిన ప్రతివారికీ సాయం చేస్తూ తన పెద్ద మనసును చాటుకున్నారన్నారు. ఆ భవంతుడు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ఇవ్వాలని, ఆయన చిరంజీవిగా భాసిల్లాలని తాను కోరుకుంటున్నట్లు అన్నారు. ఆయన మరింతమందికి
సేవ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.