వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై పవన్‌ కల్యాణ్‌ కు ఇప్పటికీ క్లారిటీ లేదా.. అంటే అవునంటున్నారు వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేయాలో ఆయన యజమాని చంద్రబాబు చెబుతాడని... సరిగ్గా పవన్‌ ఎక్కడ ఓడిపోతావో అక్కడ చంద్రబాబు ప్లేస్‌ ఇస్తాడని.. దాంతో పవన్‌ కల్యాణ్‌ మళ్లీ ఓడుతారని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు.


అలా ఓడిపోయిన తర్వాత మళ్లీ పవన్‌ కల్యాణ్.. తనను కక్ష కట్టి ఓడించారని జగన్‌ను నిందిస్తారంటూ వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు. గతంలో పవన్‌ కల్యాణ్‌ బాబా అవతారం ఎత్తిన పవన్‌ అమరావతి గురించి ప్రకటన చేశాడని... అందుకే ఒక్కసారి పవన్‌ ను సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. పవన్‌ ఒక గంట ఒక మాదిరిగా, మరో గంట మరో మాదిరిగా ఉంటాడని.. వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: