దేశంలో కరోనా తో ఢీలా పడిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఆయా సంస్థలు మెల్లిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. కరోనా కేసులు కూడా రోజురోజుకు తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నే వాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే 80 కోట్ల డోసులతో చాలా వరకు వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసింది కేంద్రం. దేశంలో పలు రాష్ట్రాలలో ఉపఎన్నికలు ఉండటంతో కరోనా ప్రభావం లేకుండా ఉండాలని ఆయా రాష్ట్రాలలో వంద శాతం వాక్సినేషన్ కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. ఈ చర్యలన్నిటితో మళ్ళీ దేశంలో సాధారణ పరిస్థితులు అతిత్వరలోనే రానున్నాయని నిపుణులు చెపుతున్నారు.

ఒకపక్క కరోనా తగ్గుముఖం పట్టడం, మరోపక్క సంస్థలు యాధస్థితికి వస్తుండటంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీ లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. నేడు కూడా మార్కెట్లలో జోష్ కనిపించింది. సెన్సెక్స్ 800 పాయింట్లు లాభపడి బీఎస్ఈ లో లిస్ట్ అయిన సంస్థల విలువ 3 లక్షల కోట్లకు చేరింది. నేడు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 59729 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ 230 పాయింట్ల పెరుగుదల నమోదు చేసుకొని 17777 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు కూడా చాలావరకు లాభాల బాట పట్టగా కొన్ని మాత్రం నష్టాలలో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా స్థిరాస్తికి చెందిన షేర్లు బాగా లాభపడ్డాయి.

మార్కెట్లలో ఈ జోష్ కు కారణం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే అని నిపుణులు అంటున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభం అయిందని వారు తెలిపారు. గత నాలుగు సెషన్లలో రియాలిటీ షేర్లు 20 శాతానికి పెరిగినట్టు వారు చెపుతున్నారు. దానిఫలితంగా 22 వారాల గరిష్ట స్థాయికి వాటి విలువ చేరిందని వారు తెలిపారు. అమెరికాలో వడ్డీరేట్లు మార్పు లేకపోవడం, అక్కడ సూచీలు కూడా భారీగా లాభాలు ఆర్జించడం ఇక్కడ మార్కెట్ల ఉత్సాహానికి కారణంగా చెపుతున్నారు. ప్రపంచం వాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రజారోగ్య సంక్షోభం నుండి బయటపడవచ్చని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: