దేశంలో జీఎస్టీ వసూళ్ల విలువ కరోనా అనంతరం మరోసారి లక్ష కోట్లు దాటింది. వరుసగా మూడో నెల ఈ వసూళ్లు లక్ష కోట్లు దాటటం విశేషం. సెప్టెంబర్ నెలకు కేంద్రప్రభుత్వం జీఎస్టీ వసూళ్లను వెల్లడించింది. జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలలలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. జులైలో 1.16; ఆగష్టు లో 1.12; సెప్టెంబర్ లో 1.17 లక్షల కోట్లు వసూలు చేసింది. గత సంవత్సరం ఇదే సమయానికి ఈ వసూళ్లు 95480 కోట్లుగా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఈసారి సెప్టెంబర్ లో 23 శాతం అధికంగా జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు ప్రకటించింది.

ఈ జీఎస్టీ వసూళ్ళలో కేంద్రం వాటా 20578 కోట్లు; రాష్ట్రాల వాటా 26767 కోట్లు; రెండు కలిసి చేసిన వసూళ్లు 60911; వివిధ సెస్ ల వసూళ్లు 8754 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం వలన దేశంలో లాక్ డౌన్ విధించారు. దీనితో దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్నీ మూతపడ్డాయి. దీనితో జీఎస్టీ సహా అన్నీ ఆదాయాలకు గండి పడింది. దానిని గాడిలో పెట్టేందుకు ఆర్థిక వెతలు తలమునకలవుతున్నారు.  ఎన్ని చేసినా కరోనా సమయంలో చేసిన సంస్కరణల నేపథ్యంలో దేశీయ వాక్సిన్ ఉత్పత్తి మూలంగా ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉన్నట్టు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ తరహా ధార్మిక వ్యవస్థను దేశంలో అనుసరించడం వలన ప్రపంచానికే ప్రయోజనం చేకూరుతుందని వారు అంటున్నారు.

ఈ సమయంలో ప్రభుత్వాలు ఆయా సంస్థలను వివిధ ఉద్దీపనలు అందించడం వలన అవి మళ్ళీ పుంజుకోగలిగాయి. దీనితో గత మూడు నెలలుగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. యావత్ ప్రపంచంలో కరోనా సమయంలో ధైర్యంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించిన దేశం భారతదేశం. అందుకే భారత్ త్వరగా పుంజుకోగలిగింది. ఒక్కసారి మూడో వేవ్ ను కూడా దాటేస్తే ఇక భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని ముందువరుసలో ఉంచడానికి ఇది చాలా అవసరమని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gst