సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇప్పుడు ప్రత్యేక సౌకర్యాన్ని ఇచ్చింది.అదేంటంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్లు పెన్షన్ స్లిప్ పొందడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.జస్ట్ వారు వాట్సాప్‌లో కేవలం ఒక మెసెజ్ పంపడం ద్వారా ఈ సదుపాయాన్ని ఈజీగా పొందవచ్చు. sbi సోషల్ మీడియా ద్వారా సమాచారం ఇచ్చింది. ఇక ఈ సదుపాయాన్ని సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి.. మీరు 9022690226కు హాయ్ అని టైప్ చేసి మెసెజ్ పంపవలసి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ వాట్సాప్ సౌకర్యం కింద ‘హాయ్’ అని మెసేజ్ చేసిన తర్వాత.. మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో బ్యాలెన్స్ సమాచారం, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ ఉంటాయి. దీని తర్వాత, పెన్షన్ స్లిప్‌పై క్లిక్ చేసి, మీరు పెన్షన్ స్లిప్ పొందాలనుకుంటున్న మంత్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మీరు కొంతకాలం వేచి ఉండాలి.ఆ తర్వాత మీకు పెన్షన్ స్లిప్ అనేది అందించబడుతుంది.స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు మరింత ఉపశమనం కలిగించడానికి వాట్సాప్ లో బ్యాంకింగ్ సర్వీసెస్ ని ప్రారంభించింది.


ఈ సదుపాయం కింద, sbi కస్టమర్ బ్యాలెన్స్ సమాచారం నుంచి మినీ స్టేట్‌మెంట్ వరకు ఈజీగా సమాచారాన్ని పొందవచ్చు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాట్సాప్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. దీని కోసం, sbi ఖాతాదారులు 7208933148 నంబర్‌కు ‘WARG’ అనే టెక్స్ట్‌తో స్పేస్ ఇవ్వడం ద్వారా ఖాతా నంబర్‌ను ఎంటర్ చేసి SMS చెయ్యాలి.అయితే, మీరు అకౌంట్ నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా SMS చెయ్యాల్సి ఉంటుంది.అయితే ఎస్పీఐ “హాయ్”లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏం చేయాలి?  ఎలా పొందాలి? అనే విషయానికి వస్తే.. మీరు రిజిస్ట్రేషన్ తర్వాత మీకు sbi నంబర్ 90226 90226 నుంచి వాట్సాప్ నంబర్‌లో ఓ మెసెజ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ నంబర్‌కు ‘హాయ్’ మెసేజ్ ని పంపవచ్చు లేదా మీరు sbi నుంచి వచ్చిన మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వవచ్చు. ఇది కాకుండా, మీరు sbi లోని ఈ సౌకర్యాలను పొందేందుకు ఇచ్చిన సూచనలను పాటించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: