మన దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని అందరికీ తెలిసిందే.అయితే మొదట్లో దీనిని కేవలం గుర్తింపు కార్డుగా తీసుకొచ్చారు. ఆ తర్వతా ప్రతి పనికి కూడా ఆధార్ ని తప్పనిసరి చేసేశారు. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నా, అడ్రస్ ప్రూఫ్ గా ఇలా ప్రతి పనికి కూడా ఆధార్ కార్డుని తప్పనిసరి చేశారు. ఆ తర్వాత కాలంలో సైబర్ క్రైమ్స్ కూడా బాగా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డు మీద వందల్లో సిమ్స్ తీసుకోవడం, తెలియని అకౌంట్స్ ఓపెన్ చేయడం కూడా చాలా మంది చేస్తున్నారు. మనకి తెలియకుండా మన ఆధార్ కార్డు మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్స్ ని కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అందుకే ఒకసారి మీరు మీ ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకోవడం మంచిది.


2010 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అది భారతీయులకు ఒక అత్యవసరమైన, తప్పనిసరి గుర్తింపు కార్డుగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాల మొదలు బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు ఇంకా ముఖ్యమైన ఏ పనికైనా ఆధార్ కార్డుని తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ ఫ్రాడ్ చేసేవాళ్లు, సంక్షేమ పథకాలను దొంగతనంగా దోచుకోవాలి అనుకునేవాళ్లు అమాయకులను బాగా మోసం చేస్తున్నారు.మనలో చాలామంది ఆధార్ కార్డు హిస్టరీ గురించి కూడా తెలియకుండా ఉండిపోతున్నారు. అందుకే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకుంటే మంచిది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఫస్ట్ మీరు ఆధార్ అధికారిక వెబ్ సైట్ యూఐడీఏఐ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఎడమవైపు మై ఆధార్ అనే ఆప్షన్ లో ఉండే ఆధార్ సర్వీసెస్ ని క్లిక్ చేయాలి.కిందకు స్క్రోల్ చేశాక ఆధార్ అథెంటికషన్ హిస్టరీ అనే ఆప్షన్ ని ఎంచుకుంటే తర్వాత మిమ్మల్ని ఒక కొత్త పేజ్ లోకి రీడైరెక్ట్ చేస్తుంది.ఆ కొత్త పేజ్ లో లాగిన్ అయ్యేందుకు ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ నంబర్ తో లాగిన్ చేయాల్సి ఉంటుంది.ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేసిన తర్వాత అథెంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది.ఆ అథంటికేషన్ హిస్టరీలో ఆల్ మీద క్లిక్ చేసి డేట్ సెలక్ట్ చేసుకుని ఫెట్చ్ అథెంటికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేయాలి.ఇక ఆ తర్వతా మీరు మీ ఆధార్ అథెంటికేషన్, ఓటీపీ, డెమోగ్రాఫిక్ ఇంకా బయోగ్రాఫిక్ తో ఆధార్ ని చివరి ఆరు నెలల్లో ఎక్కడెక్కడ వాడారో వంటి వివరాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: