సాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు  కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి  ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతకాలి.. కేవలం సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు కష్టాల్లో కూడా నేను ఉన్నాను అని భరోసా కట్టుకున్న వారికి ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడే భార్య భర్తల బంధం కలకాలం ఎంతో సంతోషంగా అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో మాత్రం భార్య భర్తల బంధం అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా కాకుండా హత్యలకు ఆత్మహత్యలకు చిరునామాగా మారింది. ఎందుకంటే దారుణంగా పట్టుకున్న వారి విషయంలోనే కర్కశంగా వ్యవహరిస్తున్నారు ఎంతమంది. ఇక భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలనే పెద్దదిగా చేసుకుంటూ చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.  మరోవైపు అక్రమ సంబంధాల నేపథ్యంలో ఇక కట్టుకున్న వారి పట్ల కాల యముడు గా మారిపోతున్నారూ ఎంతోమంది. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. ఇక ఓ భార్య తన పసుపు కుంకాలు తన చేతులతోనే తెంపుకునెందుకు ప్రయత్నించింది  ఇక ఏకంగా దారుణంగా బ్లేడు తో భర్త గొంతు కోసింది  కానీ భర్త అప్రమత్తం కావడంతో ఇక ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు వెంటనే అతని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించడం చేసారు.


 హనుమకొండ జిల్లా పామర్రు మండలం పసరగొండ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు అర్చనకు గత నెల 25వ  తేదీ వివాహం జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆ వ్యక్తి తన భర్త రాజు గొంతుకోసాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అర్చన గత కొన్ని రోజుల నుంచి ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: