ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరి జీవన శైలిలో  కూడా మార్పులు వస్తున్నాయ్. ఒకప్పటి మూఢ నమ్మకాలు నేటి రోజుల్లో మనుషుల్లో ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆధునిక జీవనశైలికి అలవాటు పడి మూఢ నమ్మకాలను గాలికి వదిలేసి ఎంతో స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా దేశంలో కొన్ని ప్రాంతాల్లో అంద విశ్వాసాలు ఉన్నాయి అన్నది మాత్రం వెలుగు లోకి వచ్చే కొన్ని ఘటనల ద్వారా అర్థమవుతుంది.


 ఇప్పటికీ మూఢ నమ్మకాల పేరుతో కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిత్ర విచిత్రమైన ఆచారాలను పాటిస్తూ ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక అంద విశ్వాసమే తెరమీదకి వచ్చి అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఇలాంటి వింత ఆచారం  గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా అందవిశ్వాసంతో ఇద్దరు మైనర్లకు గ్రామస్తులు కుక్కలతో వివాహం జరిపించిన ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.



 బాలాసోర్ జిల్లా బంద్ సహి గ్రామంలో వెలుగు చూసింది అని చెప్పాలి. తపన్ సింగ్ అనే పదకొండేళ్ల బాలుడికి ఆడి శునకంతో.. లక్ష్మికి అనే ఏడేళ్ల బాలికకి మగశునకంతో పెళ్లి చేశారు గ్రామస్తులు. అయితే ఇలా పెళ్లి చేయడానికి వెనుక ఒక వింత కారణమే ఉంది. పై దవడ భాగంలో వీరికి మొదటి పన్ను  రావటం కారణంగానే ఇలా కుక్కలతో వివాహం జరిపించారట.  పై దవడ భాగంలో మొదటి పన్ను రావడాన్ని అపశకునంగా  భావించిన గ్రామస్తులు.. ఇలా కుక్కలతో వివాహం జరిపించడం మాత్రం సంచలనగా మారింది. ఇక సాంప్రదాయ బద్ధంగా వివాహం పూర్తి చేసి విందు కూడా ఏర్పాటు చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dog