సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి.చాలా మంది కేటుగాళ్ళు అమ్మాయిలను మోసం చేసేందుకు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు.. అబ్బాయిలు చెప్పే మాయమాటలను నమ్మి చాలా మంది యువతులు మాన, ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.సోషల్ మీడియా వేదికగా ఓ ఫారినర్ యువథులకు గిఫ్ట్ లు పంపేవాడు. తర్వాత వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. గిఫ్ట్ లకు పన్ను కట్టాలని కొంత సొమ్మును అడిగే వాడు. అది నిజమని నమ్మిన యువతులు మోసపోతున్నారు..చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
 

వివరాల్లొకి వెళితే.. నైజీరియాకు చెందిన ఒక యువకుడు విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చి ఇక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత నోయిడాకు చెందిన ఒక యువకుడు, ఒక యువతితో కలిసి సైబర్ నేరాలు చేయడం ప్రారంభించాడు. సోషల్ మీడియా లో అందమైన యువతులకు గాలం వేసేవాడు. వాళ్ల కు ఖరీదైన బహుమతులు పంపుతున్నాని చెప్పేవాడు. ఆ తర్వాత అతని గ్యాంగ్ మెంబర్ అయిన మహిళ ఫోన్ చేసి సదరు బహుమతికి జీఎస్టీ కట్టి తీసుకోవాలని చెప్పేది. ఇలా స్థానికంగా ఒక మహిళకు ఇటీవలే ఫోన్ చేశారు. బహుమతి విలువ రూ.కోటి అని, జీఎస్టీ కింద రూ.28 లక్షలు కట్టాలని చెప్పారు. ఆమె కట్టనంటే ఉగ్రవాదం కింద కేసు పెడతామని బెదిరించారు.

 

దాంతో అప్పు చేసి మరీ డబ్బు కట్టిన యువతి.. తనకు ఎలాంటి బహుమతీ అందకపోవడంతో షాకైపోయింది.ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితుల ను అదుపు లోకి తీసుకున్నారు.. ఇప్పటివరకు పోలీసులు 16 మందిని విచారించారు.16 మంది యువతులను మోసం చేసినట్లు వాళ్లు అంగీకరించారు. మరింత దర్యాప్తు జరుగుతోందని, త్వర లోనే నిందితులను కోర్టు లో హాజరు పరుస్తామని తెలిపారు.. ఇలాంటి వాటిని నమ్మి మోస పొవద్దని పోలీసులు అమ్మాయిలకు హెచ్చరించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: