ఫ‌స్ట్ కాజ్ : ఆర్టిస్టు బాపు వ‌ర్ధంతి

బొమ్మ‌లు వేయ‌డం సులువు
బొమ్మ‌లు వేసిన విధంగా రంగులు
అద్ద‌డం సులువు

సులువు అయిన ప‌నులు కొన్ని చేశాడు
కొన్ని చేయ‌లేదు గోదావ‌రి తీరాల‌లో
న‌డ‌యాడు బాపు స్మ‌రించు బాపు
త‌రించు బాపు త‌ర‌లివ‌చ్చె ఆనంద రేఖ బాపు

బాపు బొమ్మ‌లు వేసి పెద్దాడ‌య్యాడు. బాపు కొత్త వారిని చూసి వారి ప్ర‌తిభ‌ను మెచ్చుకుని పెరిగాడు బాపు. బాపు పోస్ట‌ర్ల‌లో వంశీ ఉంటాడు. వాడొక డైరెక్ట‌రు. కొత్త థాట్ ఏమ‌యినా ఉందా ఒరేయ్ దానిని మ‌నం అందుకోవాలి అని అంటాడు బాపు. ఆ విధాన వం శీని పొగిడాడు లేదా మ‌రొక‌రిని త‌న సొంతం చేసుకున్నాడు. బొమ్మ‌లు వేసే బాపు నిరాడంబ‌రంగా ఉండ‌డం వ‌ల్ల పెద్దాడ‌య్యాడు.  పెద్దాడ‌య్యాక తెలుగు లోగిలికి ఇంకాస్త చేరువ అయ్యాడు. చెప్పానుగా బొమ్మ‌లు వేరు జీవితం వేరు. జీవితంలో న‌ట‌న తెలియ‌ని వాడు డైరెక్ట‌రు అయ్యాడు. న‌టించి చూప‌డం చేత‌గాక బొమ్మ‌ల‌తోనే ఆ విన్యాసాలేవో చూపించి,చేయించి త‌న న‌టుల దగ్గ‌ర నుంచి మంచి ప్ర‌తిభను రాబ‌ట్టాడు. కొన్ని సినిమాలు హిట్టు.. కొన్ని సినిమాలు ఫ‌ట్టు. తెలివైన ఆలోచ‌న‌లు కొన్ని తెలివి త‌క్కువ పను లు కొన్ని ఆ ఇద్ద‌రినీ ముంచాయి. నాలుగు కాసులు రాని వేళ ఆ ఇద్ద‌రూ ఏడ్వ‌లేదు హాయిగా న‌వ్వారు. ఆ ఇద్ద‌రూ అంటే ఒక‌రు ర‌వ‌ణ - ఒక‌రు బాపు.

తెలుగు లోగిళ్లకు ప‌రిచ‌యం అయిన రాముడు..ప‌రిచ‌యం అయిన కృష్ణుడు..కొత్త‌గా లోకానికి అందించి భాగ‌వ‌త క‌థ‌లు చెప్పా రు. బొమ్మ‌లు వేసే బాపు కొన్ని క‌థ‌లు రాశాడు. కొన్ని క‌థ‌లు రాయించాడు. హాలీవుడ్ క‌ల్చ‌ర్ లో సినిమాను తీయ‌లేదు కానీ హాలీవుడ్ సినిమాను చూసి నేర్చుకున్నాడు. నేర్చుకోవ‌డంలోనే అత‌డు ఆఖ‌రిదాకా గ‌డిపాడు. అలా గ‌డ‌ప‌డం ఆయ‌నకెంతో స రదా. కొత్త వాళ్ల‌కు ప్ర‌తిభ ఉంటే మెచ్చుకుంటాడు. ద‌రిద్రం రాస్తే నొచ్చుకుంటాడు. మీరు రాస్తున్నారు క‌దా రాయండి అని ప్రోత్స హిస్తాడు. బొమ్మ బాగుంటే నేరుగా వారి ఇంటికే ఫోను చేసి మాట్లాడ‌తాడు.

క‌థ బాగుంటే త‌మ అభిమానం అంతా చాటి ఓ ఉత్త‌రం రాసి లోకానికే చాటింపు వేస్తాడు. గోదావ‌రిని ఇంత‌గా ప‌ట్టి చూపిన వాడు లేడు. ఇక రాడు కూడా! వంశీ క‌న్నా తెలివైన వాడు బాపు. సినిమాలో గోదావ‌రి అందాలు క‌థ‌లో భాగం అయిపోయాయి. నేప థ్యాలు ఎంచుకుని క‌థ‌లు రాయ‌డం చాలా సులువు అలా అని అవే నేప‌థ్యాల‌ను ఎన్ని  సార్లు ఎంచుకుంటారు.. వంశీ అలాంటి చె డ్డ ప‌నులు చేశాడు. ఆ క‌థ‌లు కొన్ని బాలేదు అంటే చాలా మంది న‌వ్వుకుంటారు కానీ బాలేదు అని మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌ను. ఆ క థ‌లు అంటే ప‌స‌ల‌పూడి క‌థ‌లు.


బాపు గారు అలాంటి త‌ప్పులు చేయ‌రు. అవ‌స‌రం అనుకుంటేనే గోదావ‌రిని చూపించారు..అందాల‌ను చూపించాడు..అందాల రా ముడ్ని చూపించాడు. ఏఎన్నార్ ను అందాల రాముడ్ని చేసి మురిసిపోయారు. ఆ రోజుల్లో సాంఘిక సినిమాల‌కు ఆయ‌న పేరు
త‌గిలించుకోలేదు. చిరునామాగా మార్చుకున్నాడు అని రాయ‌డంలో స‌బ‌బు ఉంది. ప్ర‌శంస ఉంది. సాక్షి లాంటి క‌థ‌ల‌కు ఆయ‌నే ఆయువు. న‌ట‌న స‌రిగా రాని న‌టులెంతో ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకుని వెళ్లారు ఆ కోవ‌లో ఎంద‌రో ఉన్నారు. చిరును ప్ర‌శంసించాడు.
ఈనాడు ఆర్టిస్టు శ్రీ‌ధ‌ర్ ను ప్ర‌శంసించాడు. ఇంకా కొంద‌రిని. ఇంకా నేను నేర్చుకోవాలి..అని చెబుతూనే పిల్ల‌ల కోసం ఎన్టీఆర్ చెప్పా ర‌ని కొన్ని వీడియో క‌థ‌లు చిత్రీక‌రించారు. పెద్దల కోసం ఈటీవీ రామోజీ కోరితే భాగ‌వ‌త క‌థ‌లు చెప్పి అవి పిల్ల‌ల‌కూ చేరువ చేశా రు. బాపు గొప్ప వాడు అని రాయ‌డంలో అర్థం క‌న్నా ప‌ర‌మార్థ సంగ్ర‌హ‌ణే ముఖ్యం ఇవాళ. గొప్ప ఆర్టిస్టు బాపుకు వ‌ర్ధంతి వేళ ని వాళి ....

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: