పర్యాటకశాఖకు చెందిన భూములను లీజుకు తీసుకుని నిబంధనలకు పాటించని యాజమానుల నుంచి వెయ్యికోట్ల విలువైన రెండు స్థలాల లీజును రద్దు చేస్తూ ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ వెల్లడించారు. పర్యాటక శాఖాధికారులు ఏడాది కాలంలో 50కోట్ల పాతబకాయిలను వసూలు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. మిగతావాటి మీద లీజు నిబంధనలు పాటించని వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ స్పష్టం చేశారు. లీజు భూములను రద్దు చేసిన వివరాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు.


షామీర్ పెట్ లోని జవహర్ నగర్ లోని సర్వే నెంబర్ 12 లో సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్స్ అభివృద్ధి పేరుతో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ సంస్థ 130 ఎకరాల టూరిజం శాఖ కు చెందిన భూమిని 2004 సంవత్సరంలో తీసుకోని లీజు నిబంధనలు పాటించని  కారణం చేత సంస్థ పై చర్యలు తీసుకొని భూమిని  స్వాధీనం చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ వివరించారు.  సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ పక్కన ఉన్న 4600 గజాల విలువైన భూమిని E - City Giant Screen (India) Pvt Ltd సంస్థ లీజు నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నందున లీజు ను రద్దు చేస్తూ తిరిగి ఆ భూమి ని స్వాధీనం చేసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు.


ఏడాది కాలంగా టూరిజం అధికారుల కృషి వల్ల తెలంగాణ పర్యాటక శాఖ కు గత బకాయిలు 50 కోట్ల రూపాయలు చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు.  తెలంగాణ పర్యాటకశాఖ చెందిన భూములను తీసుకొని ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే సంస్థలపై చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌  అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ మనోహర్, ఓఎస్‌డీ సత్యనారాయణ, లీగల్ ఆఫీసర్ ఆదిల్‌ కూడా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: