ఎన్నికలకు వెళ్లే ప్రతి పార్టీ ప్రజలకు అర్థమయ్యేలా ఒక మెనిఫేస్టోను విడుదల చేస్తుంది. దీని సారాంశం పార్టీ గనక ప్రభుత్వంలోకి వస్తే ఏమేం పనులో చేస్తారో అర్థమయ్యేలా చెప్పడం. గెలిచిన తర్వాత కొన్ని అమలు చేస్తారు. మరి కొన్నింటిని అమలు చేయరు. ఇలా చేయని విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు అర్థమయ్యేలా వివరణలు ఇస్తుంటాయి.


వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1999 లో ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. దీనికి కౌంటర్ గా చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవడమే అని ప్రచారం చేశారు. మళ్లీ 2003 సంవత్సరంలో ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ హమీ ఇచ్చారు. ఈ సారి ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. కొన్ని పథకాలకు కొందరు పేర్లు గుర్తిండిపోతాయి.


రెండు రూపాయల కిలో బియ్యం అనగానే ఎన్టీరామారావు గుర్తుకు వస్తారు. ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ అనగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి లీడర్ల పేర్లు చెబుతారు. ప్రస్తుతం ఉచితంగా బియ్యం ఇస్తున్న కూడా దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014 లో మహిళలకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి దాన్ని పూర్తిగా చేయకుండా వదిలేశామని చంద్రబాబు స్వయంగా చెప్పారు. కేవలం 30 శాతం మాత్రమే అమలు చేశామని చెప్పారు.


జగన్ నవరత్నాలతో ప్రచారం చేసి 2019లో గెలిచారు. ఈ నవరత్నాల పథకంలో సంపూర్ణ మద్య నిషేదం అనేది ప్రస్తుతం అమలు కావడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒకటిన్నర శాతమే అమలు చేశారు. నిరుద్యోగ క్యాలెండర్ అనేది నవరత్నాల హామీలో ఫెయిల్యూర్.  మద్య పాన నిషేధం కొంచెం సక్సెస్ అయినా పూర్తిగా చేయలేరు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇద్దామని  పార్టీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులను పిలిపించుకుని చంద్రబాబు మాట్లాడుతున్నారు.  ఇప్పటి నుంచే అధికారంలోకి ఎలా రావాలో ఆయా వర్గాల ఓట్లు సాధించాలంటే ఏయే పథకాలు ప్రవేశపెట్టాలో వ్యుహరచన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: