ఎన్ని ఆయుధాలు ఉన్నా వాటిని సరైన విధంగా సరైన సమయంలో ఉపయోగించినపుడే వాటి ఫలితం మనకు కనిపిస్తుంది. కానీ ప్రతి సమయంలో వాటినే ఉపయోగిస్తామంటే సరికాదు. డ్రోన్లను ఉపయోగించడంలో వాటిని కంట్రోల్ చేసే విషయంలో రష్యా కంటే ఉక్రెయిన్ కాస్త మెరుగ్గా ఉంది. ఈ యుద్ధంలో మొదటి నుంచి డ్రోన్ల ద్వారానే ఉక్రెయిన్ ఎక్కువ శాతం దాడులు చేయగలిగింది. అయితే రష్యా దీన్ని పసిగట్టింది. ఈ మెరుపు దాడుల నుంచి బయటపడేందకు రష్యా ఎత్తుగడలు వేసింది. ఈ డ్రోన్ల సిస్టమ్ ను డైవర్ట్ చేసే కొత్త సిస్టమ్ ను రష్యా కనుగొంది.


రివర్స్ ఎటాక్ కు దిగింది. డ్రోన్ల ద్వారానే ముందుగా బాంబులను ఫిక్స్ చేసి అనుకున్న టార్గెట్ పై మార్క్ చేసి అక్కడ డ్రోన్లతో బాంబులు వేసి ఉక్రెయిన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీన్ని గమనించిన ఉక్రెయిన్ వాటిని కూల్చేందుకు ప్రయత్నాలు చేసింది. కొన్ని చోట్ల విజయం సాధించింది. అయితే ఒకే విమానం నుంచి రెండు రెక్కల ద్వారా బాంబులను జారవిడిచే పద్ధతితో రష్యా, ఉక్రెయిన్ అంచనాలకు అందకుండా టార్గెట్ లను ఫినిష్ చేసింది. దీంతో ఉక్రెయిన్ బిత్తర పోవాల్సిన పరిస్థితి. ఎన్ని రకాల అధునాతన బాంబులతో దాడులు చేస్తున్న రష్యా దానికి తగిన విధంగా రూటు మార్చుకుంటూ ఉక్రెయిన్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది.


అమెరికా, యూరప్ దేశాలు ఇస్తున్న ఆయుధాలను కూడా రష్యా పేల్చి వేస్తోంది. ఇలా పేల్చేస్తున్న ఆయుధాల వల్ల ఆర్థిక పరంగా, సైనిక పరంగా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుంది. ఇటు అమెరికా ఉక్రెయిన్ ను నాటో లో సభ్యత్వం ఇప్పించడం లేదు. అటు రష్యా యుద్ధాన్ని ఆపడం లేదు.. ఉక్రెయిన్ ఎక్కడ తగ్గడం లేదు. దీంతో 16 నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. సైనికులు చనిపోతూనే ఉన్నారు. ఈ మరణా కాండ  ఎన్నటికీ ఆగుతుందోనని ప్రపంచ దేశాలు సైతం వేచి చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: