తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి.  దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దాదాపు రెండేళ్లుగా కవిత పేరు తెరపైకి వస్తోంది. ఈ విషయంపై రెండు సార్లు ఈడీ విచారణను కూడా కవిత ఎదుర్కొన్నారు. తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు దిల్లీకి చెందిన నాయకులు అరెస్టు అయ్యారు.


కొందరు అప్రూవర్ గా మారి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఈడీ కవితను సాక్షిగా ఛార్జిషీటులో చేర్చి.. తర్వాత ముద్దాయిగా పేర్కొన్నారు.  కవితతో పాటు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పలుమార్లు నోటీసులు అందించింది.  అయినా స్పందన లేదు. వివిధ కారణాలతో విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ క్రమంలో కేసు విచారణ జరిగిన రోజే దిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకొని కవితను అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ విషయంలో ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.


అయితే ప్రధాని మోదీ తెగువ ఎంటో కేసీఆర్ కి అర్థం కావడం లేదు. మా కవితను ముట్టుకుంటే ప్రళయం వచ్చేస్తుంది అనే తరహాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఓ రకంగా చెప్పాలంటే మోదీ సవాల్ విసిరి తెలంగాణాకు వచ్చినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత అరెస్టు సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ఉదయం నుంచి కేరళ, తమిళనాడులో ప్రచారం చేసిన ఆయన సాయంత్రానికి రాజధానికి చేరుకొని మల్కాజిగిరిలో భారీ రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనం పట్టారు.  

మరోవైపు కవిత అరెస్టుపై ప్రధాని రోడ్ షోలో నిరసనలు వ్యక్తం అవుతాయని భావించిన బీఆర్ఎస్ నాయకులు ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో అవాక్కయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం దిగిపోయిన తర్వాత ఎలా ఉంటుందో, తన శక్తి ఏంటో కేసీఆర్ కి ప్రధాని రుచి చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: